తెలుగు సినీ ఇండస్ట్రీలో అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈమె అందం నటన మాటలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈమె కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. టాలీవుడ్లోకి ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన కానీ సరైన కథ దొరకలేదని ఎంట్రీ ఇవ్వలేదని గతంలో తెలియజేయడం జరిగింది.తాజాగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న 30 వ చిత్రంలో ఈమె హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు నిన్నటి రోజున తన భర్తడే సందర్భంగా చిత్ర బృందం ఒక పోస్టర్తో క్లారిటీ ఇవ్వడం జరిగింది.


ఇక ఇప్పటివరకు పూజ కార్యక్రమాలు కూడా నోచుకోని ఈ సినిమా ఈ నెలలోనే షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ బర్తడే సందర్భంగా ఎన్టీఆర్ -30 వ ప్రాజెక్టులోకి వెల్కమ్ హ్యాపీ బర్తడే జాన్వీ కపూర్ అంటూ తెలియజేశారు.ఎన్టీఆర్ నీ కెరియర్ లో గొప్పదిగా నిలవాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

జాన్వీ కపూర్ సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఉన్నటువంటి ఒక పోస్టర్ను షేర్ చేయడం జరిగింది.ఎన్టీఆర్ పతాకం పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ పని చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి రాగానే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ పోస్ట్ అతను షేర్ చేయడం జరిగింది నా ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేయడానికి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారంటూ వ్రాసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ సినిమాతో జాహ్నవి కపూర్ సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: