
షాకింగ్ గా ఈ అమ్మడికి గత సంవత్సరం పెద్దగా ఆఫర్లు లేవు. పుష్ప భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత బ్యాక్ బ్యాక్ సినిమాలను చేయక పోవడానికి కారణం భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే అని అందరూ అనుకుంటున్నారు.
రష్మిక భారీగా రెమ్యూనరేషన్ పెంచింది అనే ప్రచారం కూడా జరగడం తో కొంత మంది నిర్మాతలు ఆమె ను కనీసం సంప్రదించకుండానే మరో హీరోయిన్ తో కమిట్ అవుతున్నారని తెలుస్తుంది.. దాంతో రష్మిక మందన తన రెమ్యూనరేషన్ ని సగానికి కుదించుకున్నట్లుగా సమాచారం.. ఒక కన్నడ మీడియా లో వచ్చిన కథనం ప్రకారం రష్మిక రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కి ఓకే చెప్పి సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. పారితోషికం తగ్గించుకోవడం తో రష్మిక ఇక ముందు మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అలాగే మీడియా సర్కిల్స్ వారు కూడా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే రెండు కోట్ల రూపాయలకు సినిమా లు చేస్తాను అంటూ ప్రకటించినా కూడా ఆఫర్లు వరుసగా వస్తున్నట్లుగా అయితే కనిపించడం లేదని తెలుస్తుంది..మరి చూడాలి ఈ అమ్మడి నిర్ణయం ఆఫర్స్ తెచ్చిపెడుతుందో లేదో…