ఇటీవల కాలంలో ప్రేక్షకుల పంథా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోలు సినిమాల్లో కనిపిస్తే చాలు.. నాలుగు ఫైట్లు నాలుగు పాటలు ఉంటే చాలు ఆ సినిమాను హిట్ చేసేవారు. కానీ ఇటీవల కాలంలో స్టార్ హీరోలు నటించిన సరే సినిమాలో కథ కథనం మాత్రం ఎంతో బలంగా ఉండాల్సిందే. ప్రతి ఒక్కటి బాగుంటేనే స్టార్ హీరోలు సినిమాలు సైతం హిట్ టాక్ సొంతం చేసుకుంటూ ఉన్నాయి. అదే సమయంలో ఇక అప్పుడు వరకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని చిన్న చిన్న హీరోలు కూడా మంచి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ హిట్ కొడుతున్నారు.


 కథ కథనం బాగుంటే చాలు ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు తెరకెక్కిస్తే చాలు.. ఎలాంటి చిన్న సినిమా అయినా సరే పెద్ద హీరో సినిమాకు ఎక్కడ తీసిపోనీ విధంగా హిట్టు కొట్టొచ్చు అని ఇప్పటివరకు ఎన్నో సినిమాల నిరూపించాయ్. కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా కూడా ఇలాగే హిట్ అయింది అని చెప్పాలి. పూర్తి ఎమోషనల్ కంటెంట్తో తెరకెక్కిన  ఈ సినిమాకు ప్రేక్షకులు అందరూ ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. ఇక ఇందులో నటించింది కొత్త వారే అయినప్పటికీ అందరి పై ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉన్నారూ అని చెప్పాలి. మొదటి మూవీ తోనే తనలో దాగి ఉన్న దర్శకత్వ ప్రతిభ ఏంటి అన్న విషయాన్ని వేణు నిరూపించుకున్నాడు. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వేణు.. దర్శకుడిగా కూడా సక్సెస్ అవుతాడు అనే నమ్మకాన్ని అభిమానుల్లో కలిగించాడు అని చెప్పాలి. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ తర్వాత ప్రస్తుతం దర్శకుడు వేణు మరో ప్రాజెక్ట్ కోసం సిద్ధం అవుతున్నాడట. మీడియం బడ్జెట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నాడట. ఇక బలగం సినిమాకు నిర్మాతగా ఉన్న దిల్ రాజు ప్రొడక్షన్లోనే వేణు మరో సినిమా కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వేణు తర్వాత ప్రాజెక్ట్ కథ ఏంటి.. ఇక నటీనటులు ఎవరు అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: