
ఒకప్పుడు విజయశాంతి రమ్యకృష్ణ లాంటివాళ్ళు అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించినట్లుగానే.. ఇక ఇప్పుడు కూడా ఎంతో మంది హీరోయిన్లు హీరోలకు దీటుగా లేడి ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తూ సూపర్ హిట్ కొడుతున్నారు అని చెప్పాలి. హీరోలకు మేము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తూ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ కొంతమంది హీరోయిన్లు కెరియర్ లో ముందుకు సాగుతున్నారు. ఇక అలాంటి వారిలో అనుష్క, నయనతార, దీపిక, సమంత, వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పాలి.
ప్రస్తుత కాలంలో సమంత, నయనతార, దీపిక పదుకొనే లాంటి హీరోయిన్లు హీరోలకు ఎక్కడ తీసుకోకుండా యాక్షన్స్ సీక్వెన్స్ లలో నటిస్తున్నారు అని చెప్పాలి. మొన్నటికి మొన్న పఠాన్ సినిమాలో దీపిక చేసిన యాక్షన్ సీక్వెన్స్ చూసి ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా అయిపోయారు. ఇక అటు వరలక్ష్మి శరత్ కుమార్ అయితే పవర్ఫుల్ హీరోలకు దీటుగా విలనిజం పండిస్తూ అదరగొడుతూ వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఇలా కొంతమంది హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకు పరిమితం అవుతున్న... మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం హీరోలకు మేము ఎక్కడ తక్కువ కాదు అని వారి సినిమాలతోనే నిరూపిస్తున్నారు.