
యంగ్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక బాలయ్య ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో అటు తమన్ అలాంటి మ్యూజిక్ అందించి హిట్టు కొట్టడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీ ట్రాక్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బాలయ్యతో అనిల్ రావిపూడి గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడని అభిమానులు కూడా అనుకుంటున్నారు. 30 ఏళ్ల వయసులో జైలుకెళ్లి 50 సంవత్సరాల పైబడిన తర్వాత విడుదలయ్యే క్యారెక్టర్ బాలయ్యది అని అనిల్ రావిపూడి ఒక క్లారిటీ కూడా ఇచ్చేశాడు.
ఇదిలా ఉంటే ఇటీవలే బాలయ్య కు సంబంధించిన కొన్ని ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. బాలయ్య చేతి మీద బాణం మార్క్ ఉన్న ఒక టాటూ ఉంది. బాలయ్య ఇప్పుడు వరకు ఇలా ఒంటిపై టాటూలు వేసుకొని సినిమా చేసింది చాలా తక్కువ. ఇక ఇప్పుడు బాలయ్య చేతిపై ఇలాంటి స్టైలిష్ టాటూ కనిపించడంతో.. పవర్ఫుల్ బాలయ్యను అనిల్ రావుపూడి కొత్తగా చూపించేందుకు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఆహా ఇండియన్ ఐడల్ కు బాలయ్య స్పెషల్ జడ్జ్ గా అటెండ్ అవ్వబోతుండగా.. ఇటీవల ప్రోమోలు విడుదలయ్యాయ్. ఈ ప్రోమోలలోనే అటు బాలయ్య చేతి పైన ఉన్న బాణం టాటూలో సింహం గుర్తు కూడా కనిపిస్తుంది అని చెప్పాలి.