ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ఫాహధ్ ఫాజిల్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో అనసూయ , సునీల్ , రావు రమేష్ కనిపించనున్నారు. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ మ్యూజిక్ కు సంబంధించిన పనులను ఈ చిత్ర బృందం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పాటల పనులపై చెన్నై బయలుదేరినట్లు తెలుస్తోంది.

అలాగే ఈ పాటలకు సంబంధించిన కసరత్తులో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తో పాటు దర్శకుడు సుకుమార్ ... అల్లు అర్జున్ కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం షూటింగ్ కు వారం గ్యాప్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పుష్ప పార్ట్ 1 మూవీ అదిరిపోయే రేంజ్ విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగినట్టు గానే ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: