బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమన్నాడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్. పంజాబీ సింగర్ సిద్ధూమూసే వాలాని దారుణంగా చంపి అతని హత్యతోపాటు పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.అందులో భాగంగా కేసు విచారణల సందర్భంగా లారెన్స్ చాలా విషయాలని వెల్లడించాడు.ఇంకా అలాగే మీడియాతో కూడా తన సమాచారాన్ని పంచుకున్నాడు.గతంలో సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు తాను ప్రయత్నించినట్లు ఇంకా అలాగే అతడిని బెదిరించినట్లు కూడా లారెన్స్ అంగీకరించాడు. అయితే, సల్మాన్‌ ఖాన్ ను లారెన్స్ లక్ష్యంగా చేసుకునేందుకు ప్రధాన కారణం కూడా ఉంది. సల్మాన్ ఖాన్ గతంలో కృష్ణ జింకను చంపినట్లుగా అతడిపై చాలా ఆరోపణలొచ్చాయి. దీనిపై అప్పుడు కోర్టు విచారణ కూడా జరిగింది. కృష్ణ జింకల్ని బిష్ణోయ్ వర్గం వాళ్లు దేవునితో సమానంగా భావిస్తారు. అలాంటి దేవునితో సమానమైన జింకను సల్మాన్ చంపాడనే కారణంతో అతడిపై లారెన్స్ బిష్ణోయ్ అప్పటి నుంచి పగ పెంచుకున్నాడు.


ఎప్పడికైనా అతడ్ని చంపాలని జీవిత లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. ఈ అంశంపై లారెన్స్ బిష్ణోయ్ ఈమధ్య కీలక విషయాలు చెప్పాడు.''మాకు దైవంతో సమానమైన కృష్ణ జింకను చంపినందువల్ల సల్మాన్‌ ఖాన్ పై మా వర్గం వాళ్లు చాలా ఆగ్రహంగా ఉన్నారు. తన చర్యల ద్వారా సల్మాన్ ఖాన్ మా వర్గం వాళ్లను ఎంతగానో అవమానించాడు. మేం అతడిపై ఫిర్యాదు కూడా చేశాం. అతడు ఖచ్చితంగా మా వాళ్లకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే అతను చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను ఈ విషయంలో అసలు ఎవరి మాటా కూడా వినను. ఇంకా ఎవరిపైనా ఆధారపడను. ఈ విషయంలో చిన్నప్పట్నుంచి అతడిపై నా మనసులో చాలా ద్వేషం ఉంది. సల్మాన్‌ ఖాన్ కు రావణుడికంటే అహం ఎక్కువ. మేం ఆ అహాన్ని త్వరలో తగ్గిస్తాం. బికనేర్‌లో మేం పూజించే గుడికొచ్చి సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పాలి." అని లారెన్స్ అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: