
అయితే ఈ విషయంలో యూనివర్సిలో ఒక పాత్ర పక్కాగా డిసైడ్ చేయడానికి వీలు లేదు ఎప్పుడు ఏ పాత్ర ఎలా ఎంటర్ అవుతుందో ఎలా ముగిస్తుందో ఊహించలేనిది ఎక్కడికక్కడే సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు.ఖైదీ సినిమా నుంచి విక్రమ్ సినిమాకు లింక్ చేయడం ఇక్కడ కూడా ఈ సినిమా చైన్ లింక్ ఎంతవరకు వెళుతుందో గెస్ చేయలేనిది.. ఇందులో కొత్త పాత్రలతో పాటు పాత పాత్రలు కూడా పరిచయం కాబోతున్నాయట. వాటితో పాటు సైడ్ క్యారెక్టర్లకు అంతే ప్రాధాన్యత కూడా కనిపిస్తుందని సమాచారం.
అయితే తాజా అందుతున్న సమాచారం ప్రకారం రోలెక్స్ పాత్రతో మాఫియాని ముగించడం సాధ్యమైన పని కాదని గెస్సింగ్ తెరపైకి వస్తున్నాయి. స్టోరీ కంటిన్యూ లో భాగంగా వరల్డ్ డ్రగ్ మాఫియానే లోకేష్ తనదైన స్టైల్ లో పరిచయం చేయబోతున్నారని ఇందులో రాముడు రావణుడు ఒక్కడే అని వినిపిస్తోంది.. హీరో పాత్రని ప్రతి నాయకుడిగా డిజైన్ చేయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ టైటిల్ ట్రాక్ లోనే రాముడు కాదు రాక్షసుడు వీడియో అంటూ రీవిల్ చేసిన సందర్భం ఒకటి ఉన్నది. మరి తాజాగా ఈ సినిమా ప్రచారానికి టైటిల్ ట్రాక్ కి సంబంధం ఉందని తెరపైకి వార్తలు వినిపిస్తున్నాయి.