
కానీ గత కొంతకాలం నుంచి మాత్రం కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న వైవిద్యమైన పాత్రలు మాత్రమే చేస్తుంది. ఇక అందాల ఆరబోత చేసే పాత్రలను అస్సలు ఒప్పుకోవడం లేదు. మరోవైపు లేడి ఓరియంటెడ్ సినిమాలను కూడా చేస్తూ లేడీస్ సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అలాంటి నయనతార ఇక ఇప్పుడు ఎన్నో రోజుల తర్వాత మరోసారి బికినీలో హాట్ గా కనిపించేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది నయనతార. అక్కడ కూడా తన మార్కెట్‌ను పెంచుకోవాలని ప్లాన్ వేసింది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే తన రూల్స్ కి విరుద్ధంగా ఏకంగా షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో బికినీలో కనిపించడానికి సిద్ధమైందట. ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం నయన్ చేసే పాత్ర బికినీలో కనిపించాల్సి ఉంటుందట. ఇక దీనికి అటు నయన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. కానీ దీని కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట ఈ ముద్దుగుమ్మ. ఇక దీనికి నిర్మాతలు కూడా ఓకే చెప్పేశారు అన్నది తెలుస్తుంది. ఇక ఈ వార్త కాస్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం అటు సినిమా విడుదల అయ్యేంతవరకు ఎవరికీ తెలియదు.