ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతుంది నయనతార. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్ద కాలం పైన గడిచిపోతుంది. అయితే అప్పటికి ఇప్పటికీ నయనతార సినిమాల విషయంలో తీసుకునే నిర్ణయాలలో ఎంతో మార్పు వచ్చింది. ఒకప్పుడు హీరోల సరసన కేవలం గ్లామర్ హీరోయిన్ గా మాత్రమే నటించేందుకు ఒప్పుకుంది. ఇక ఇలా తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఎంతగానో గ్లామర్ వలకబోసి అభిమానులకు పిచ్చెక్కించింది ఈ ముద్దుగుమ్మ. సౌత్ లో అందరు స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ లు కూడా తన ఖాతాలో వేసుకుంది. కానీ గత కొంతకాలం నుంచి మాత్రం కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న వైవిద్యమైన పాత్రలు మాత్రమే చేస్తుంది. ఇక అందాల ఆరబోత చేసే  పాత్రలను అస్సలు ఒప్పుకోవడం లేదు. మరోవైపు లేడి ఓరియంటెడ్ సినిమాలను కూడా చేస్తూ లేడీస్ సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి.  అలాంటి నయనతార ఇక ఇప్పుడు ఎన్నో రోజుల తర్వాత మరోసారి బికినీలో హాట్ గా కనిపించేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది.  ప్రస్తుతం బాలీవుడ్ లో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది నయనతార. అక్కడ కూడా తన మార్కెట్ను పెంచుకోవాలని ప్లాన్ వేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన రూల్స్ కి విరుద్ధంగా ఏకంగా షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో బికినీలో కనిపించడానికి సిద్ధమైందట. ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం నయన్ చేసే పాత్ర బికినీలో కనిపించాల్సి ఉంటుందట. ఇక దీనికి అటు నయన్  కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. కానీ  దీని కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట ఈ ముద్దుగుమ్మ. ఇక దీనికి నిర్మాతలు కూడా ఓకే చెప్పేశారు అన్నది తెలుస్తుంది.  ఇక ఈ వార్త కాస్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం అటు సినిమా విడుదల అయ్యేంతవరకు ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: