కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం సినిమాల్లో హీరోగా నటించడం కాకుండా సినిమాల్లో ఇతర ముఖ్య పాత్రలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా కూడా మోహన్ బాబు ... గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 14 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది.

మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఆఖరుగా మోహన్ బాబు సోలో హీరోగా సన్నాఫ్ ఇండియా అనే మూవీ లో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర గోర పరాజయన్ని ఎదుర్కొంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మోహన్ బాబు తన కుమారుడు హీరోగా నటించిన జిన్నా మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ ... మంచు విష్ణు హీరోగా రూపొందిన జిన్నా మూవీ చాలా గొప్ప సినిమా ... కానీ ఆ మూవీ ఎందుకు ఫెయిల్ అయిందో నాకు అర్థం కావడం లేదు. ఆ మూవీ లో విష్ణు తన కెరియర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటూ మోహన్ బాబు తాజా ఇంటర్వ్యూ లో జిన్నా మూవీ లోని మంచు విష్ణు నటన గురించి స్పందించాడు. మంచు విష్ణు హీరోగా రుపొందిన జున్నా మూవీ లో పాయల్ రాజపుత్ ... సన్ని లియోన్ లు హీరోయిన్ లుగా నటించారు. సూర్య దర్శకత్వం వహించిన ఈ మూవీ కి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఈ మూవీ 21 అక్టోబర్ 2022 లో థియేటర్ లలో విడుదల అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: