యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ... టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో గతంలో జనతా గ్యారేజ్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన సమంత ... నిత్యా మీనన్ లు హీరోయిన్ లుగా నటించగా ... ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఇటు ఎన్టీఆర్ కు అటు ... కొరటాల శివ కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు ఈ మూవీ కి గాను లభించాయి.

ఇలా ఇప్పటికే జనతా గ్యారేజ్ మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఈ కాంబినేషన్ లో మరో మూవీ రాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ సినిమాకు ఇప్పటివరకు ఈ చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఎన్టీఆర్ 30 అనే టైటిల్ తో ఈ మూవీ యూనిటీ ఈ సినిమాను ప్రకటించింది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ తో సరికొత్త డైలాగ్ డెలివరీ ని కొరటాల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉండబోతున్నట్లు ... ఇది వరకు ఎన్టీఆర్ ఎప్పుడు చెప్పని విధంగా ఈ మూవీ లో డైలాగ్ డెలివరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: