నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను ప్రపంచ వ్యాప్తంగా అమ్మి వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందో తెలుసుకుందాం.
నైజాం ఏరియాలో ఈ మూవీ కి 13.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ,  సీడెడ్ లో 6.5 కోట్లు , యూ ఏ లో 3.9 కోట్లు , ఈస్ట్ లో 2.35 కోట్లు , వెస్టు లో 2 కోట్లు , గుంటూరు లో 3 కోట్లు ,  కృష్ణ లో  2 కోట్లు ,  నెల్లూరు లో 1.2 కోట్లు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 34.65 కోట్ల  ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.


కర్ణాటక లో ఈ మూవీ కి 2.85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ,  ఇతర భాషలలో 1.5 కోట్లు , నార్త్ ఇండియాలో 5 కోట్లు ,  ఓవర్సీస్ లో 6 కోట్లు మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ సినిమా 51 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగబోతుంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: