ఉస్తాద్ రామ్ అదేనండి మన రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అందించాయి. ఎద్దుని లాగుతూ రామ్ మాస్ లుక్ ఆయన ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. అసలే బోయపాటి సినిమా అంటే మహా మాస్ మూవీ అనే టాక్ తెలిసిందే. రామ్ తో చేస్తున్న సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని తెలుస్తుంది. రిలీజైన ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేశారు మేకర్స్.

రామ్ ఈసారి బాక్సాఫీస్ పై తన ముద్ర వేయాలని చూస్తున్నాడు. బోయపాటి శ్రీను సినిమా సరైన టార్గెట్ రీచ్ అయితే రామ్ ఇక మీదట నెక్స్ట్ లెవల్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమాలో రామ్ సరసన లక్కీ హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. అసలే వరుస సక్సెస్ లతో సూపర్ ఫాం లో ఉన్న శ్రీలీల రామ్ సినిమాకు మరింత క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు. పూరీ జగన్నాథ్ తప్ప తన కెరీర్ లో స్టార్ హీరోలతో పెద్దగా పనిచేయని రామ్ బోయపాటితో చేస్తున్న మొదటి సినిమాతోనే పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు.

సినిమా తర్వాత రామ్ రేంజ్ నిజంగానే మారుతుందని ఫస్ట్ లుక్ చూస్తేనే అర్ధమవుతుంది. రామ్ ఈ సినిమాలో దుమ్ము దులిపేస్తాడని తెలుస్తుంది. బోయపాటి టేకింగ్ లో రామ్ మాస్ యాక్షన్ థియేటర్ లో మాస్ ఫ్యాన్స్ కు పండుగ తెస్తుందని చెప్పొచ్చు. అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న ఈ సినిమా విషయంలో ప్రతిదీ చాకా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ లో రిలీజ్ కాబోతున్న రామ్ మూవీ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయాలని చూస్తున్నారు. మరి సినిమా ఆశించిన రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: