ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద హీరోల దగ్గర నుండి చిన్న హీరోల వరకు కథల కొరతతో బాధ పడుతున్నారు. చాలామంది దర్శకులు ఎంత ప్రయత్నించినా వెరైటీ కథలను వ్రాయలేకపోతున్నారు అన్నవిమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపెట్టిన షార్ట్ కట్ ను ఇప్పుడు చాలామంది దర్శకులు అనుసరిస్తున్నారా అన్న సందేహాలు లేటెస్ట్ గా విడుదలైన ‘దసరా’ మూవీని చూసిన కొందరికి కలుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.



‘అ ఆ’ ‘అల వైకుంఠ పురములో’ మూవీ చూసిన వారికి చాల పాత సినిమాలు గుర్తుకు వచ్చి తీరుతాయి. ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలై సక్సస్ సాధించిన ‘దసరా’ మూవీని చూసిన మధ్యతరం ప్రేక్షకులకు ‘మనవూరి పాండవులు’ ‘చిల్లరదేవుళ్ళు’ సినిమాలు గుర్తుకు వస్తాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక దొర ఆదొరకు విపరీతమైన అమ్మాయిల పిచ్చితో పాటు తన దొర తనాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి కుట్రలు అయినా చేయడం ‘దసరా’ లో కొంతమేరకు కనిపిస్తుంది.




బ్లాక్ బష్టర్ హిట్ కొట్టిన ‘కేజీ ఎఫ్’ లో బంగారు గనుల నేపధ్యం దుమ్ము మట్టి కనిపిస్తే ‘దసరా’ మూవీలో బొగ్గు గనుల నేపధ్యం దుమ్ము మట్టీ కనిపిస్తాయి. ‘మనవూరి పాండవులు’ లక్షలు ఖర్చుపెట్టి క్లైమాక్స్ తీస్తే ‘దసరా’ క్లైమాక్స్ కోసం కోట్లు ఖర్చుపెట్టి తీయడంతో ఆ క్లైమాక్స్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. దీనితో కొంచెం తెలివిగా పాత సినిమాలను ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా రీ డిజైనింగ్ చేసి తీస్తే చాలు ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్న సంకేతాలు కొందరికి వస్తున్నాయి. ది బెస్ట్ టెక్నీషియన్లతో తెలివిగా సినిమా తీస్తే చాలు ఆసినిమా నేటి తరం ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఆ మూవీలోని హీరోకు దర్శకుడుకి మంచి పేరుతో పాటు వారికి కెరియర్ కు మంచి బ్రేకు వస్తుంది అన్న సందేశం ‘దసరా’ సక్సస్ ఇండస్ట్రీకి ఇస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: