
ఒక విధంగా చెప్పాలి అంటే ప్రస్తుతం శ్రీలీల క్రేజ్ తో ఏకంగా 10 సినిమాల వరకు లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సింగ్ సినిమా కూడా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీలీల ఏ పాత్రలో నటిస్తోందో అన్న విషయం ఇంకా ఆసక్తికరంగానే ఉంది. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు శ్రిలీల స్టార్ డం ని వృధా చేసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి . అందుకు కారణం ఈమె ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తున్న కూడా అందులో సెకండ్ లీడ్ రోల్ పాత్రలలోని నటిస్తున్నట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర అంటే ఎలా ఉంటుందో గత సినిమాలు చూసిన వారికి తెలుస్తోంది.. పేరుకే సెకండ్ హీరోయిన్ అని ఇమేజ్ తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక బాలయ్య సినిమాలలో శ్రీ లీల కూతురు పాత్ర పోషిస్తుంది. హీరోయిన్ పాత్ర కాదు బాలయ్య కూతురు పాత్ర అన్నట్లుగా తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గానే నటిస్తోంది. ఇలా స్టార్ హీరోల చిత్రాలలో సెకండ్ ప్రాధాన్యత లేని పాత్రలలో నటించడం వల్ల శ్రీ లీల ఇమేజ్ దెబ్బ తినడమే తప్ప కెరియర్ పరంగా పెద్దగా ఒరిగేదేమీ లేదని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ విషయంపై శ్రీ లీల జాగ్రత్త పడుతుందేమో చూడాలి మరి.