ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ సినిమా బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 మూవీ గా రూపొందుతున్న కారణంగా ఈ మూవీ యొక్క షూటింగ్ ను "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం తెరకెక్కిస్తోంది.

మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... శ్రీ లీల ... పూజా హెగ్డేమూవీ లో మహేష్ సరసన హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.  కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన రాత్రి వేళ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ కి సంబంధించిన రాత్రి వేళ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ నుండి ఇప్పటికే మహేష్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయగా ... ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అమెరికా థియేటర్ హక్కులను ఈ మూవీ యూనిట్ అమ్మివేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క అమెరికా థియేటర్ హక్కులను ఈ చిత్ర బృందం 14.50 కోట్లకు అమ్మివేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: