టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత అయిన డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఇంకా టైటిల్ కూడా ఖాయం చేయని ఈ సినిమా 'ఓజీ'(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్)గా చాలా బాగా ప్రాచుర్యం పొందింది. జనవరి 30 వ తేదీన పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా చాలా ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'ఓజీ' సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే పవన్ కళ్యాణ్ అభిమానులలో ఇంకా సినీ ప్రియుల్లో ఈ సినిమాపై ఎన్నో రకాల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు పాల్గొంటారా.. అని ఆయన అభిమానూలు, సినీ ప్రేక్షకులంతా కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఆరోజు రానే వచ్చింది. 'ఓజీ' సినిమా సెట్స్ లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు.మూడు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 15 వ తేదీ నుంచి 'ఓజీ' సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం నాడు ఉదయం మేకర్స్ ఒక ఫోటోను వదిలారు. అందులో బ్లాక్ హూడీని ధరించి, కళ్లద్దాలతో పవన్ కళ్యాణ్ చాలా స్టైల్‌గా పవన్ కనిపిస్తున్నారు.


ఏప్రిల్ 15వ తేదీ నుంచి మొదలైన ఈ షెడ్యూల్ లో ముంబై ఇంకా పరిసర ప్రాంతాల్లో నెలాఖరు వరకు షూటింగ్ అనేది జరగనుంది. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య నటీనటులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ తో పాటు పలు కీలక సన్నివేశాలను కూడా షూట్ చేయనున్నారు.ఇక భారీస్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ప్రముఖ టోగ్రాఫర్ రవి కె చంద్రన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా ఇంకా ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌గా వ్యవహరిస్తున్నారు.అలాగే పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'భీమ్లా నాయక్'కి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఎస్ థమన్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బలానికి ఇంకా ఆయన స్టార్డమ్‌కి సరిగ్గా సరిపోయే కథతో యాక్షన్ డ్రామాగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఖచ్చితంగా థమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం ఇంకా అద్భుతమైన ఇతర టెక్నికల్ టీం టాలెంట్ తోడై అటు యాక్షన్ ప్రియులను ఇంకా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులను అలరిస్తుందని నిర్మాత డీవీవీ దానయ్య చాలా నమ్మకంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: