కొంత కాలం క్రితం కార్తి హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఖైదీ సినిమాలో ఆఖరి ఫైట్ లో కార్తీ ఒక మిషన్ గన్ తో కాల్పులు జరుపుతాడు. ఆ ఫైట్ సీన్ అద్భుతంగా ఉండడంతో ... ఆ ఫైట్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఆ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందినటువంటి "కే జీ ఎఫ్ చాప్టర్ 2" మూవీ లో ఒక సన్నివేశంలో యాష్ మిషన్ గన్ తో అద్భుతమైన ఫైరింగ్ చేస్తాడు.

ఈ సీన్ అద్భుతంగా ఉండడం మాత్రమే కాకుండా ఈ మూవీ కూడా విజయం సాధించింది. అలాగే లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందినటువంటి విక్రమ్ మూవీ లో కూడా కమల్ హాసన్ అదిరిపోయే రేంజ్ లో మిషన్ గన్ తో ఫైరింగ్ చేస్తాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి "వాల్టేర్ వీరయ్య" సినిమాలో మిషన్ గన్ తో ఒక ఫైట్ చేస్తాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

ఇలా ఈ మధ్య కాలంలో హీరోలు మిషన్ గన్ తో ఫైరింగ్ చేసిన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అఖిల్ "ఏజెంట్" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసింది. ఇందులో అఖిల్ మిషన్ గన్ తో అదిరిపోయే రేంజ్ లో ఫైరింగ్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా కూడా హిట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: