హీరోయిన్స్ పెళ్లి తరువాత మారడం సాధారణమే. కానీ, స్వీటీ అనుష్క మాత్రం సినిమా కోసం బరువు పెరిగి ఇంకా అలాగే ఉండిపోయింది.

సూపర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది ఈ యోగా టీచర్.. సెక్సీ నడుముతో కుర్రకారును పిచ్చెక్కించింది. బిల్లా, డాన్ సినిమాల్లో బికినీ వేసి బాగా మెప్పించింది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిన స్వీటీ సైజ్ జీరో సినిమా తో ప్రయోగం చేసి తన జీవితాన్ని మొత్తం తలకిందులు చేసుకొంది. ఆ సినిమా కోసం బరువు పెరిగి.. తర్వాత తగ్గడాని కి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, అమ్మడు ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. ఇప్పటికి అనుష్క బొద్దుగానే ఉంది. ఆ సినిమా నుంచి చాలా సెలక్టివ్ గా అయితే సినిమాలు ఎంచుకుంటున్న అనుష్క.. చాలా గ్యాప్ తరువాత మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు అయితే రానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడట.ఇక అనుష్క సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియా లో ఆమె చాలా తక్కువ అయితే కనిపిస్తుంది. ఎప్పుడో స్వీటీ పోస్ట్ చేసే ఫోటోలు, ఎయిర్ పోర్ట్ లో ఫోటోలతోనే అభిమానులు చూసి బతికేస్తున్నారు. ఇక తాజాగా స్వీటీ  తన కొత్త ఫోటోను షేర్ చేసింది. వైట్ కలర్ డ్రెస్ లో బుగ్గ కింద చేయి పెట్టుకొని ఎంతో ముద్దు గా అయితే కనిపిస్తోంది. అయితే ఇంకా బొద్దుగానే ఉంది అని కూడ చెప్పొచ్చు. దీంతో ట్రోలర్స్ .. అనుష్కను ట్రోల్ చేస్తుంటే.. ఆమె అభిమానులు మాత్రం బొద్దుగా ఉంటే మాత్రం ఏంటి రా.. దేవత.. దేవతనే అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట బాగా వైరల్ గా మారింది. మరి మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టితో హిట్ లభిస్తుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: