ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకులలో ఒకరు అయినటు వంటి మణిరత్నం గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం తన కెరియర్ లో ఎన్నో గ్రేట్ మూవీ లకు దర్శకత్వం వహించి ఎంతో మంది ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే.

మొత్తంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగం పోయిన సంవత్సరం భారీ ఎత్తున తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి భాగం ప్రేక్షకులను బాగానే అలరించింది. దానితో ఈ మూవీ రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ యొక్క రెండవ భాగాన్ని రేపు అనగా ఏప్రిల్ 28 వ తేదీన తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ ప్రీమియర్స్ ఫ్రీ బుకింగ్స్ ను ఈ చిత్ర బృందం ఓపెన్ చేసింది. అందులో భాగంగా ఈ మూవీ ఓవర్ సిస్ ప్రీమియర్స్ మొదటి రోజుకు సంబంధించి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఓవర్సీస్ ప్రీమియర్స్ మొదటి రోజుకు కాను ఇప్పటికే 1 మిలియన్ మార్క్ ను టచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో విక్రమ్ , కార్తి , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష కీలకపాత్రలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: