సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకనిర్మాతలు, హీరో హీరోయిన్లు ఏదో ఒక సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు. ఇక ప్రతి సినిమా విషయంలో కూడా ఈ సెంటిమెంట్ రిపీట్ అయ్యేలా చూస్తూ ఉంటారు. అదే సమయంలో వారికి ఏదైనా బ్యాడ్ సెంటిమెంట్ ఉంటే వారి సినిమాల విషయంలో ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఎక్కడ రిపీట్ కాకుండా చూసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక అచ్చంగా ఇలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకేంద్రుడిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాఘవేంద్రరావుకి కూడా ఇలాంటి బ్యాడ్ సెంటిమెంట్ ఒకటి ఉంటుందట.


 ఆ బ్యాడ్ సెంటిమెంట్ గురించి మాట్లాడితే చాలు ఆయన భయపడిపోతూ ఉంటారట. సాధారణంగా అమెరికాలో ఎక్కువ మంది శుక్రవారం 13వ తేదీని బ్యాడ్ సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. కానీ రాఘవేంద్రరావుకి కూడా ఇలాంటి బ్యాడ్ సెంటిమెంట్ ఉందట. ఇంతకీ రాఘవేంద్రరావు  13వ తేదీ అంటే ఎందుకు భయపడతారు.. ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. మేమున్న అత్త ఇంట్లో ఏడు, తొమ్మిది 14 నెంబర్లు ఉండేవి. ఇక ఆ నెంబర్స్ ఇంప్రూవ్మెంట్ లాగానే నేను పనిచేసే ప్రతి ప్రొడక్షన్ హౌస్ లోనూ కొంత అటాచ్మెంట్ తో పాటు అచీవ్మెంట్ కూడా ఉండేది అని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు.



 ఓసారి ఓ విషయంలో నిర్మాత ఆర్గుమెంట్తో అప్సెట్ అయ్యాను. ఆ రోజు ఇంటికి నడుచుకుంటూ వచ్చాను. తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. గేటు దగ్గరికి వచ్చేసరికి అంతకుముందు ఇంటి నెంబర్ 14 ఉంటే ఇక చివరికి కార్పొరేషన్ వాళ్లు 13 గా మార్చారు. నాకేమో 14వ నెంబర్ లక్కీ నెంబర్. దీంతో ఆవేశంతో ఆ నెంబర్ చెరిపేసాను. అప్పుడు మా నాన్నగారు ఏమైంది అని అడిగితే జరిగిన విషయం చెప్పాను. అయితే నిన్ను పోగొట్టుకుంటే బాధపడాల్సింది నువ్వు కాదు వాళ్లు అని ఆయన నాకు ధైర్యం ఇచ్చారు. ఇక అప్పటినుంచి ఏ హోటల్ రూమ్ తీసుకున్న నెంబర్ 13 రాకుండా చూసుకుంటాను. అప్పటి నుంచి 13వ తేదీ అంటే చాలు భయం మొదలైంది అంటూ రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: