తమిళంలో తెరకెక్కించిన బిచ్చగాడు సినిమా అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో కూడా ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో నటుడుగా విజయ్ ఆంటోని ప్రేక్షకులకు బాగా సుపరిచితమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కూడా తెరకెక్కించబోతున్నట్లు తెలియజేశారు.


బిచ్చగాడు సినిమా తర్వాత విజయ్ ఆంటోని తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. తాజాగా బిచ్చగాడు-2 సినిమాని తెలుగులో విడుదల చేసేందుకు చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తున్నారు. ఈ సినిమాని విజయ్ ఆంటోనీని స్వయంగా దర్శకత్వం వహించారు. దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అయితే ఈ చిత్రం మొదట ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా అనుకున్నంత సమయానికి విడుదల కాలేక పోయింది.

గతంలో కూడా సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విజయ ఆంటోనీకి గాయాలు కావడంతో పలు సర్జరీలు కూడా జరిగాయి. దీంతో ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యిందని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సరికొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. బిచ్చగాడు -2 సినిమా వేసవి కానుకగా మే 19వ తేదీన విడుదల చేయబోతున్నామంటూ చిత్రబృందం
 సరికొత్త విడుదల తేదీతో పాటు ఒక పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ను మాత్రం ఈ రోజున ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది ఈ చిత్రంలో హీరోయిన్ గా కావ్య దాపర్ నటించింది. మరి పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: