టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి మంచి పేరు ఉన్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు తమ కుటుంబానికి ఇండస్ట్రీలో ఉన్న స్థానాన్ని కల్పించారు. ఇక ఆ లెగసీని కొనసాగిస్తూ ఆయన వారసుడు అక్కినేని నాగార్జున కూడా అన్ని విజయాలతో మంచి పేరు సంపాదించడం జరిగింది. అయితే ఇప్పుడు వారి లెగసీని వారి వారసులు కొనసాగించలేకపోతున్నారనే చెప్పాలి ఇప్పటివరకు అటు నాగ చైతన్య ఇటు అఖిల్ సినిమాల విషయంలో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.  వాస్తవానికి అఖిల్ తో పోల్చుకుంటే నాగచైతన్య తన సినిమాలతో పర్వాలేదు అనిపించుకుంటున్నాడు

కానీ అఖిల్ మాత్రం ఇప్పటివరకు తన ఖాతాలో ఒక హిట్టు కూడా వేసుకోకపోవడం గమనార్హం. ఇక మొన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ పర్వాలేదనిపించుకున్నాడు. అయితే ఈసారి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా భారీ స్థాయిలో డిజాస్టర్ ను చవి చూసింది. నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా కూడా మొదటి ఆదివారం జీరో షేర్ నమోదు చేయడం గమనార్హం. ఇలా అఖిల్ ఏజెంట్ సినిమా నాగచైతన్య ధాంక్యు రెండు సినిమాలు కూడా ఈ విధంగా డిజాస్టర్  అవ్వడం వారి కుటుంబాన్ని అవమానపరిచిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హీరో కైనా ఫ్లాప్ అనేది సర్వసాధారణం కానీ వారి ఫ్లాప్ లి  వారి కుటుంబ వారసత్వానికి అవమానం కలిగించే స్థాయిలో ఉన్నాయి. అందుకే అక్కినేని బ్రదర్స్ ఇకపై స్క్రిప్ట్ లను  జాగ్రత్తగా ఎంచుకోవడం మొదలుపెట్టినట్లు సమాచారం. ఏదిఏమైనా అక్కినేని బ్రదర్స్ ఇకపై స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త వహించి మునుముందు మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానుల సైతం ఆకాంక్షిస్తున్నారు.  ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ..ఇందులో మృతి చెట్టి హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమా నైనా వీరికి మంచి విజయాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: