టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో గౌతమ్ తిన్ననురి ఒకరు. ఈ దర్శకుడు సుమంత్ హీరోగా రూపొందిన మళ్లీ రావా మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా క్రికెట్ స్పోర్ట్స్ నేపథ్యంలో జెర్సీ అనే మూవీ ని గౌతమ్ రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి ఈ దర్శకుడికి అద్భుతమైన ప్రశంసలు కూడా లభించాయి ఇదే మూవీని ఈ దర్శకుడు.

ఆ తర్వాత షాహిద్ కపూర్ హీరోగా హిందీ లో జెర్సీ మూవీ ని రీమిక్ చేశాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లను పెద్దగా రాబట్ట లేకపోయినప్పటికీ విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలను అందుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించిన మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గ నటించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించిన ఒక తాజా న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ఈ సంవత్సరం జూన్ నెల నుండి మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ... సమంత హీరోయిన్ గా శివ నర్వన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: