
సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లల్లో ఎంతోమంది హీరోలు , నిర్మాతలు, దర్శకులు ఇలా ఎంతోమంది చేత ఆయన అవమానపడ్డాడు. కానీ ఏ రోజు కూడా కృంగిపోలేదు. ఆయన ముందు చూపే ఆయనను మెగాస్టార్ గా మార్చింది అని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇకపోతే ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్ అందుకున్న తర్వాత రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టిన చిరంజీవి అక్కడ ఎక్కువ కాలం ఉండలేక తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా కొద్ది రోజులు పని చేశారు. ఇక తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ బిజీగా దూసుకుపోతున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించాడు. మరొకవైపు భోళాశంకర్ సినిమాతో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ నేపథ్యంలోనే కొత్త డైరెక్టర్లకి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇక అందులో భాగంగానే తాజాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ పథాకం పై ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట చిరంజీవి . ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడబోతోంది. ఏది ఏమైనా ఈ వయసులో కూడా పోటీ పడుతూ ఈయన వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండడం గమనార్హం.