
ఈ సినిమాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు 35 వేల షోలు ప్రదర్శించే ఆస్కారం ఉంది అంటున్నారు. ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డ్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను నేడు ముంబాయ్ లో అత్యంత ఘనంగా విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్ లో కూడ ప్రసాద్ ప్రీవ్యూ ధియేటర్లలో ఈ మూవీ ట్రైలర్ ను ఈరోజు మధ్యానం విడుదల చేస్తారు.
అయితే ప్రభాస్ హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి హాజరు కాకుండా ముంబాయ్ లో జరిగే కార్యక్రమంలో బిజీగా ఉండబోతుతున్నాడు. అంతేకాదు జూన్ 16న విడుదల కాబోతున్న ఈ మూవీని ప్రమోట్ చేస్తూ అనేక బాలీవుడ్ పత్రికలకు అలాగే అనేక ప్రముఖ మీడియా సంస్థలకు ప్రభాస్ వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నాడు. అంతేకాదు ‘ఆదిపురుష్’ మూవీకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్ ముంబాయి తో పాటు ఢిల్లీ లక్నో కలకత్తా నగరాలతో పాటు చెన్నై బెంగళూరు త్రివేండ్రంలో జరగబోతున్నాయి.
ఈ ఈవెంట్స్ అన్నింటికీ ప్రభాస్ కృతి సనన్ సైఫ్ ఆలీఖాన్ లు రాబోతున్నారు. ‘ఆదిపురుష్’ మూవీ ఈవెంట్ భాగ్యనగరంలో చివరగా ఈ మూవీ రిలీజ్ డేట్ కు ముందు జరగబోతోంది. దీనితో ప్రభాస్ తెలుగు మీడియాను అంతగా పట్టించుకోవడం లేదా అంటూ కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈరోజు విడుదల కాబోతున్న ఈమూవీ ట్రైలర్ కు వచ్చే స్పందనను బట్టి ఈమూవీ సాధించే విజయం ఆధారపడి ఉంటుంది..