అల్లరి నరేష్ తాజాగా ఉగ్రం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. విజయ్ కనకమెడల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

4 రోజుల్లో నైజాం ఏరియాలో ఈ సినిమా 84 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా ,  సీడెడ్ లో 34 లక్షలు , యూ ఏ లో 27 లక్షలు , ఈస్ట్ లో 18 లక్షలు , వెస్టు లో 11 లక్షలు , గుంటూరు లో 18 లక్షలు ,  కృష్ణ లో 17 లక్షలు ,  నెల్లూరు లో 9 లక్షలు , కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లో కలుపుకొని ఈ మూవీ 24 లక్షల కలక్షన్ లను వసూలు చేసింది. మొత్తం మీద ఈ సినిమా 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.42 కోట్ల షేర్ ... 5.25 కోట్ల గ్రాస్ కలక్షన్ లని వసూలు చేసింది.


ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 5.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.50 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఈ మూవీ మరో 4.08 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: