టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా రూపొందిన ఆర్ ఎక్స్ 100 అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం ... అలాగే ఈ సినిమాలో ఈ నటుడు కూడా తన నటన తో ప్రేక్షకులను ఆకట్టు కోవడంతో కార్తికేయ కు ఆర్ ఎక్స్ 100 మూవీ విజయం తర్వాత అనేక తెలుగు సినిమా లలో అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈ యువ హీరో కు ఆర్ ఎక్స్ 100 రేంజ్ విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు దక్కలేదు. ఈ యువ నటుడు సినిమాల్లో హీరో పాత్రల్లో మాత్రమే కాకుండా విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే నాని హీరో గా రూపొందినటు వంటి నానిస్ గ్యాంగ్ లీడర్ మూవీ లోనూ ,  ఆజిత్ హీరో గా రూపొందిన వలిమై అనే తమిళ మూవీ లో కూడా కార్తికేయ విలన్ పాత్రలో నటించాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ నటుడు "బెదురులంక 2012" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం జూన్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ తో కార్తికేయ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: