ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రస్తుతం స్టార్ హీరోగా హవా నడిపిస్తున్నాడు  రవితేజ.సింధూరం అనే సినిమాలో ఒక కీలకపాత్రలో నటించడం ద్వారా సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రవితేజ.. ఇక ఇప్పుడు మాస్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమాతో ఒకసారిగా హీరోగా నిలుదొక్కుకున్నాడు రవితేజ  ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో రవితేజ జోరు చూపించి అదరగొట్టాడు. కానీ మధ్యలో వరుసగా డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతని కెరియర్ ముగిసిపోయిందని ఎంతోమంది అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే క్రాక్ అనే సినిమాతో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు మాస్ మహారాజా రవితేజ. గోపీచంద్ మలినేని  దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు రవితేజ. రవితేజకు జోడిగా శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాకి రవితేజ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు వచ్చాయి అని చెప్పాలి  రవితేజకు సూపర్ కం బ్యాక్ ఇచ్చిన క్రాక్ సినిమా గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 గోపీచంద్  ముందుగా క్రాక్ సినిమాను రవితేజతో తీయాలని అనుకోలేదట. సీనియర్ హీరో వెంకటేష్ కి ఈ కథ వినిపించాడట. గతంలో వెంకటేష్ తో గోపీచంద్ మలినేని బాడీగార్డ్ సినిమా చేశాడు. అక్కడి నుంచి వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో ముందుగా వెంకీతో చేయాలని అనుకున్నాడట డైరెక్టర్. అయితే ఆ సమయంలో వేరే కమిట్మెంట్స్ ఉండడంతో వెంకీ ఈ సినిమాను వదులుకున్నాడట. ఇక వెంకీ వదులుకోవడంతో తనకు బాగా కలిసి వచ్చిన హీరో రవితేజకు కథ వినిపించాడట. అప్పటికి వీరి కాంబినేషన్లో డాన్ శీను, బలుపు సినిమాలు వచ్చి హీట్ అయ్యాయి. ఇక ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ సూపర్ హిట్ సాధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: