
కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా సారా జైన్, అంజలి లావనియా హీరోయిన్గా నటించారు. జాకీష్ ష్రాఫ్, అడవి శేషు సహ మరికొంతమంది కీలకపాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా స్వరాలు అందించారు. ఈ సినిమాలో పాపారాయుడు అనే పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడారు. 2011 డిసెంబర్ 9వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ లో సూపర్ డూపర్ హిట్ అవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. కానీ చివరికి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది.
మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అప్పటికే కొమరం పులి, తీన్మార్ సినిమాలతో వరుస ప్లాపులు చూసిన పవన్ కళ్యాణ్ కు ఇక పంజా సినిమా మరింత దెబ్బ కొట్టింది అని చెప్పాలి. అయితే పంజా సినిమాకి ఫస్ట్ ఛాయిస్ పవన్ కళ్యాణ్ కాదట. ముందుగా ఈ సినిమా స్టోరీ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ దగ్గరికి వెళ్లిందట. ఈ కథ విన్న తర్వాత నచ్చినప్పటికీ అప్పటికే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడట అజిత్. దీంతో నో చెప్పాడట. చివరికి కోలీవుడ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ పవన్ కళ్యాణ్ వద్దకు కథతో వెళ్లగా ఆయనకు నచ్చడంతో ఓకే చెప్పారు. కానీ చివరికి ఈ సినిమా డిజాస్టర్ గానే మిగిలిపోయింది.