హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదటగా మ్యూజిక్ డైరెక్టర్గా తన కెరీర్ నీ ప్రారంభించిన ఈయన దాని తర్వాత హీరోగా మారి విభిన్నమైన సినిమాలును చేశాడు. దాంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. హీరోగా ఆయన నటించిన బిచ్చగాడు సినిమా సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఏ విధంగా షేర్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన నటించిన బిచ్చగాడు 2 సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలో సైతం విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్నాయి. 

ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ సైతం విడుదల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ తెలుగులో వరుసగా ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఆ ఇంటర్వ్యూలలో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 సినిమాకి సంబంధించిన అనేక రకాల విషయాలను చెప్పాడు. వాటితో పాటు తన వ్యక్తిగత విషయాలు మరియు అతనికి టాలీవుడ్ లో ఇష్టమైన హీరో ఎవరు సినిమా ఏది అన్న విషయాలను గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు విజయ్ ఆంటోని. అయితే టాలీవుడ్ లో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు అని అడిగింది యాంకర్.

దానికి సమాధానం గా నేను టాలీవుడ్ లో అందరికీ హీరోల సినిమాలలో చూస్తాను..కానీ వ్యక్తిగతంగా నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని.. ఆయన అంటే నాకు ఎంతో అభిమానం అని.. ఆయన తర్వాతే నాకు ఎవరైనా అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు విజయ్ ఆంటోని. దీంతో ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇక బిచ్చగాడు 2 సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాకి బిచ్చగాడు సినిమాకి అసలు సంబంధం లేదు. ఈ సినిమా మొత్తం కేవలం డబ్బు మరియు సైన్స్ చుట్టే ఉంటుంది. ఈ సినిమాలో ఎమోషన్స్ సైతం చాలా బాగుంటాయి అంటూ చెప్పాడు విజయ్ ఆంటోని..!!

మరింత సమాచారం తెలుసుకోండి: