బాలీవుడ్ భామ దీపిక పదుకొనె అప్పట్లో హిందీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న టైం లో సౌత్ నుంచి ఏ ఆఫర్ వచ్చినా నో వే అనేసింది. కానీ ఇప్పుడు మాత్రం అమ్మడు సౌత్ సినిమాల అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో నటిస్తున్న దీపిక ఆ సినిమాలో అమ్మడు నటించేందుకు గాను 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తుంది. ప్రాజెక్ట్ కె భారీ సినిమా వైజయంతి బ్యానర్ లో దాదాపు 500 కోట్లతో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా కోసం దీపిక 10 కోట్లు తీసుకోవడం న్యాయమే అనిపిస్తుంది.

ఈ సినిమాకు ప్రభాస్ కి 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఉంటుందని టాక్. అయితే ప్రాజెక్ట్ కె తర్వాత దీపిక పదుకొనె మరో సౌత్ సినిమాకు సైన్ చేసిందని టాక్. శింబు హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమాలో దీపికని హీరోయిన్ గా అడిగారట. సినిమా చేస్తా కానీ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాలని అందట. డిమాండ్ ఉన్న హీరోయిన్ కదా ఏ ఐదో పదో అడుగుతుంది లే ఇచ్చేద్దాం అనుకున్నారట. కానీ దీపిక అడిగిన రెమ్యునరేషన్ కి కోలీవుడ్ మేకర్స్ మైండ్ బ్లాక్ అయిందని తెలుస్తుంది.

శింబు సినిమా కోసం దీపిక ఏకంగా 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ అడిగిందట. అలా భారీ రెమ్యునరేషన్ అడిగే సరికి మేకర్స్ డైలమాలో పడ్డారట. శింబు సరసన కథలో దీపిక హీరోయిన్ గా అయితే పర్ఫెక్ట్ అని దర్శక నిర్మాతలు అనుకోగా ఆమె అడిగిన రెమ్యునరేషన్ చూసి మైండ్ బ్లాక్ అయ్యిందట. ఫైనల్ గా వారు చేసేదేమి లేక అమ్మడితో బేర సారాలు ఆడుతున్నారని తెలుస్తుంది. మరి దీపిక పదుకొనె కోలీవుడ్ ఛాన్స్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.  ఈ సినిమాను దేసింగ్ పెరియసామి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.  
మరింత సమాచారం తెలుసుకోండి: