తమిళ హీరో విజయ్ ఆంటోని హీరోగా నటించిన బిచ్చగాడు సినిమా 2016లో విడుదలై ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమా ఆడియన్స్ బాగానే ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూడడానికి బ్రహ్మరథం పట్టారు. తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన ఈ చిత్రం తెలుగులో ఎక్కువగా కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ చిత్రం మదర్ సెంటిమెంటుతో ఉండడంతో ఆడియన్స్ను సైతం ఫిదా అయ్యేలా చేశా. దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత బిచ్చగాడు -2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది.హీరో విజయ్ ఆంటోని ఈ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహించినట్లుగా సమాచారం. ఈ రోజున గ్రాండ్గా ఈ సినిమా విడుదల అయింది మరి సినిమా విజయాన్ని అందుకుందో లేదో చూద్దాం.


ఇటీవల చెన్నైలో పలు ప్రాంతాలలో స్పెషల్ షోస్ కూడా వేయడం జరిగింది. ఈషో లో నుంచి తెలిపిన సమాచారం ప్రకారం ఈ సినిమా చాలా బాగుందని ఈ చిత్రంలో విజయ్ ఆంటోని అద్భుతమైన నటనాన్ని కథపరంగా ఒక బిజినెస్ మ్యాన్ చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుందని.. అతని బ్రెయిన్ మార్చాల్సిన పరిస్థితి వస్తుందని ఆ పైన మార్చిన తర్వాత ఏం జరిగింది మధ్యలో హీరో బిచ్చగాడిగా ఎందుకు మారాల్సి వచ్చింది అని కాన్సెప్ట్ తో పాటు అన్నాచెల్లెల బంధానికి ఉన్న కథా అంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.


మొదటి భాగం మదర్ సెంటిమెంట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన విజయ్ ఆంటోని సెకండ్ పార్ట్ లో సిస్టర్ సెంటిమెంటుతో చూపించాలని ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయని..ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని మరొకసారి విజయ్ ఆంటోని సాలిడ్ హిట్టుని తన ఖాతాలో వేసుకున్నారని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా సక్సెస్ అయ్యిందా లేదా తెలియాలి అంటే మరో కొద్ది గంటలు ఆగితే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: