
గ్యాంగ్ స్టార్ డ్రామా తెరకెక్కిస్తున్న OG సినిమానీ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం చేస్తున్నారు.ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ హీరో అని డైరెక్టర్ సుజిత్ తన ఫేవరెట్ హీరోని ఏ రేంజ్ లో చూపిస్తారో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ ఈ సినిమా పైన రోజురోజుకి ఎక్స్పెక్టేషన్ పెంచేలా చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా షూటింగ్ విషయం పైన కూడా అప్డేట్ ఇస్తూ ఉన్నారు చిత్ర బృందం.
ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా అక్కడ ఒక ఫైట్ అండ్ సాంగ్ షూటింగ్ జరుపుకున్నారు. హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తూ ఉన్నది. ఈ షెడ్యూల్ అయిపోయిన వెంటనే టైటిల్ అనౌన్స్మెంట్ కూడా మేకర్స్ చేయడం జరిగింది..OG పై తాజాగా మరొక అప్డేట్ ఇవ్వడం జరిగింది ముంబై షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ షెడ్యూల్ ఈరోజు హైదరాబాదులో మొదలవుతోంది అంటూ ట్విట్టర్ వేదికగా డివివీ ఎంటర్టైన్మెంట్ నుంచి ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో అభిమానుల సైతం పవన్ కళ్యాణ్ ఇతర చిత్రాల కంటే ఈ సినిమా పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారని అందుకే ఇంతలా షూటింగ్ని స్పీడ్ గా పూర్తి చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.