పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రకాష్ రాజ్ ఈ మూవీcలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి ధానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైంది. అలాగే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ముగిసింది.

మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ లో పవన్ మరియు ప్రియాంక లు పాల్గొన్నారు. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతూ వస్తున్నప్పటికీ ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ఈ మూవీ బృందం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించ లేదు.

కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ... అందుకు అనుగుణంగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు ... అనుకున్నవి అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ ఇది వరకు బాలు , పంజా మూవీ లలో గ్యాంగ్ స్టార్ పాత్రలలో నటించాడు. ఈ మూవీ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం చెందినప్పటికీ ఈ మూవీ లో పవన్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. మరి మరోసారి గ్యాంగ్ స్టార్ పాత్రలో నటిస్తున్న పవన్ ఈ సినిమాతో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: