సరైన జోడి కోసం వెతుకుతున్నా : సమంత

టాలీవుడ్ హాట్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ప్రస్తుతం సమంత ఫుల్ బిజీగా ఉంది. వరుస సినిమాలు చేస్తూ ఉంది.తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పూర్తిగా దృష్టి పెట్టింది. శాకుంతలం సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ఖాతాలో వేసుకోవడంతో..తన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఖుషి ఇంకా సిటాడెల్ షూటింగ్ లో వున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉండే సామ్.. ఇప్పుడు తనకు మంచి జోడీ కోసం వెతుకుతున్నానంటోంది. ఇక ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్ స్టా వేదికగా తెలిపింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఆ జోడీ తనకోసం కాదు..సెలబ్రెటీలకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ జెవల్ గమాడియా కోసం. 'డాక్టర్ జెవల్ గమాడియాకు సరిపోయే మ్యాచ్ కోసం మేం వెతుకుతున్నాం. 


అతడు కనిపించేదానికంటే చాలా తెలివైనవాడు' అంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది.ఇక ఇంతకీ ఆ డాక్టర్ ఎవరంటే.. ఆయన ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రెటీలకు వైద్యం చేశారు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ఇంకా అజయ్ దేవగణ్.. ఇలా చాలా మంది తారలకు అతను ట్రీట్మెంట్ అందించారు. సెలబ్రిటీలకు ఆయన వెస్టర్న్‌ అక్యుపెంచర్‌ ద్వారా చికిత్సని అందిస్తారు. ఇక సమంత పెట్టిన పోస్ట్‌ చూస్తుంటే తాజాగా తను కూడా ఆ లిస్ట్ లో చేరిపోయినట్లు తెలుస్తోంది.ఇక ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సామ్.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ పై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఇంకా ఈ మూవీతో పాటు..సిటాడెల్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: