
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ ఐడల్ సీజన్ 2 తెలుగు ఫైనల్ ఎపిసోడ్స్ కి అటెండ్ అవుతారని. తనకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని. తప్పకుండా ఈ షోని బన్నీ చాలా ఎంజాయ్ చేస్తాడని అన్నారు అల్లు అరవింద్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 జడ్జిలుగా థమన్, గీతా మాధురి, కార్తీక్ ఉన్నారు. వీక్లీ వన్స్ స్పెషల్ గెస్ట్ లతో ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. తెలుగులో ఉన్న అద్భుతమైన సింగస్ ని వెలికి తీసేలా ఈ సింగింగ్ టాలెంట్ ఉపయోగపడుతుంది.
ఇప్పటికే సీజన్ 1 సూపర్ సక్సెస్ కాగా సీజన్ 2 కూడా ఆహా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 2 ఫైనల్స్ కి వెళ్లింది ఎవరంటే.. శృతి, జయరామ్, లాస్య ప్రియ, కార్తికేయ, సౌజన్య భాగవతుల ఫైనల్స్ కు చేరుకున్నారు. వీరిలో ఫైనల్ విజేత ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఈ ఫైనల్ ఎపిసోడ్ కి అల్లు అర్జున్ రావడం ఈ ఎపిసోడ్ కి మరింత క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు. మరి అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తున్నాడు అంటే ఆ షో రేటింగ్ అదిరిపోతుందని చెప్పొచ్చు. ఆహా ఇప్పటికే తెలుగు ఓటీటీ గా దూసుకెళ్తుంది. ఈ ఎపిసోడ్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.