
అయితే ఈరోజు నుంచి మొదలు సెప్టెంబర్ 30 వరకు ఈ గడువు ఇచ్చింది ఆర్బిఐ అయితే ఈ నోట్లను మార్చుకోవడానికి మొదటి రోజు కావడంతో బ్యాంకుల వద్ద చాలా క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. రూ.2000 నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకుల్లో ఎలాంటి ఫామ్ అవసరం లేదని ఐడెంటిఫై కూడా అవసరం లేదని ఆర్బిఐ తెలుపుతోంది.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే విషయాన్ని తెలిపింది ఒక వ్యక్తి ఒకసారి రూ.20,000 రూపాయలు మాత్రమే మార్చుకునేందుకు ఎలాంటి ఫామ్ నింపాల్సిన అవసరం లేదని తెలిపారు.
అయితే ఈ నోట్లను ఎక్కడైనా సరే ఏ బ్యాంకు లోనైనా సరే మార్చుకోవచ్చట.. ముఖ్యంగా ప్రజలు రద్దీగా ఉంటే క్యూలను నియంత్రించేందుకు కొన్ని రాష్ట్రాలలోని బ్యాంకులో స్థానిక పోలీసులకు సహకారం కూడా కోరడం జరిగింది.. కానీ నకిలీ రూ.2000 రూపాయల నోట్ల గురించి కూడా బ్యాంకులు హెచ్చరించాయి నకిలీ నోట్లోను ఎవరైనా డిపాజిట్ చేసిన మార్పిడి చేసినందుకు ప్రయత్నించిన పోలీస్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ఇంకా నాలుగు నెలలు సమయం ఉన్నందువలన ప్రతి ఒక్కరు నెమ్మదిగానే వీటిని మార్చుకోవచ్చని తెలియజేస్తున్నారు. అయితే ఈ నోటు చలామణిలో ఉన్నదని కేవలం నగదు నిర్వహణ చర్యలలో భాగంగానే రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు శక్తి కాంత్ తెలిపారు.