తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. వారసుడు సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు విజయ్. ఈ సినిమా భారీ వసూళ్లను అందుకుంది. ప్రస్తుతం ఆయన లియో సినిమా చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు. ఇక విజయ్ స్టార్ డం నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ నటించిన తో ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు రికార్డుల వర్షం కురిపిస్తుందని భావిస్తున్నారు చిత్ర బంధం. 

అయితే గత కొంతకాలంగా లియో సినిమా తర్వాత విజయ్ తెలుగు డైరెక్టర్ తో ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి .ఈలోపే విజయ్ ఒక షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడట.ఎవరైనా వరుసగా హిట్ ఇచ్చే దర్శకుడితో సినిమా చేయాలని అనుకుంటారు. కానీ విజయ మాత్రం అందరి హీరోలకి భిన్నంగా ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి విజయ్ తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు క్యూ కడతారు. కానీ ఆయన మాత్రం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఇప్పటివరకు వెంకట్ కెరియర్లో పెద్దగా ఆకట్టుకున్న సినిమాలేవి లేవు.

తాజాగా ఈయన దర్శకత్వంలో కస్టడీ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా సైతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇలాంటి ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో విజయ్ సినిమా ఓకే చేయడంతో విజయ్ ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. అయితే వెంకట్ డైరెక్షన్ లో వచ్చే సినిమా కథ బాగోలేవు అని చెప్పలేం.కానీ ఆయన డైరెక్షన్లో వచ్చే సినిమాలు అందర్నీ పెద్దగా ఆకట్టుకోలేవు. ఆయన సినిమాలు చాలా తక్కువ మందికి నచ్చుతాయి. అందుకే ఆయన దర్శకత్వంలో విజయ్ సినిమా అంటే ఆయన అభిమానులు భయపడుతున్నారు. స్క్రిప్ట్ నచ్చే విధంగా చెప్పినప్పటికీ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇక ఈ వార్త విన్న మరికొందరు తన కెరియర్ లో పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: