తమిళ టాలెంటెడ్ హీరో ఇంకా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో వచ్చిన బిచ్చగాడు-2 సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తోంది. 2016 లో విడుదల అయిన బ్లాక్ బస్టర్ మూవీ బిచ్చగాడుకి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సినిమా హిట్ అయ్యి భారీగా వసూళ్లను రాబడుతోంది.ఈ సినిమా మొదటి రోజు 4 కోట్లు, రెండో రోజు మూడు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఫస్ట్ వీకెండ్‌లోనే 10 కోట్ల గ్రాస్ మార్క్‌ని దాటిందని అంచనా వేస్తున్నారు.ఇక ఈ సినిమా హిట్ కావడంతో విజయ్ ఆంటోని 2025 లో బిచ్చగాడు 3 సినిమాని తీసుకోచ్చేందుకు రెడీ అయ్యాడు.ఇక వచ్చే వారం కూడా బిచ్చగాడు 2 సినిమా హవానే కొనసాగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ వారం దాదాపు పది సినిమాలు థియేటర్లోకి రాబోతున్న కానీ ఒక్క సినిమాకు కూడా బిచ్చగాడు 2 సినిమాకు ఉన్నంత బజ్‌ అనేది లేదు. సీనియర్ లవ్ స్టోరీతో ‘మళ్ళీ పెళ్లి’ పెళ్లి అంటూ.. మే 26న రాబోతున్నారు సీనియర్ నటుడు నరేష్, లోకేష పవిత్ర. కానీ అనుకున్నంత బజ్ ఈ సినిమాకి రావడం లేదు.


ఇక అదే రోజు రాబోతున్న మరో చిన్న సినిమా ‘మేమ్‌ఫేమస్’ అనే ఓ సినిమా మాత్రం కాస్త డిఫరెంట్‌గా ప్రమోట్ అవుతోంది.ఇటీవల కాలంలో ట్రైలర్‌, టీజర్ ఇంకా ప్రమోషన్స్ విషయంలో ‘మేమ్‌ఫేమస్’ సినిమా చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఇక తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ తనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ వారంలో మళయాళ బ్లాక్ బస్టర్ సినిమా 2018, నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ కీ రోల్ ప్లే చేసిన ‘మెన్ టూ’తో పాటు.. మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. జైత్ర, గ్రే- ది స్పై హు లవ్డ్ మీ, గోవిందా భజాగోవింద, కరాళ, రైట్ ఇంకా ఏలియన్స్ 2042 లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అయితే ఈ సినిమాల్లో కాస్తో, కూస్తో బజ్ ఉందంటే మళ్ళీ పెళ్లి ఇంకా మేమ్‌ ఫేమస్ సినిమాలు మాత్రమే. మరి ఈ సినిమాల్లో బిచ్చగాడు2 వసూళ్లని కొట్టే సినిమా ఏదవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: