ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఒక అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాను సుకుమార్ తీసిన విధానం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ గా అను మెహతా నటించడం జరిగింది.కాగా శివ బాలాజీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. కాగా ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని 

అందించగా ఈ సినిమాలోని పాటలు ఈ సినిమా సక్సెస్ లో కీలక రోల్ ప్లే చేసింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా  మే 7  2004న విడుదలైంది.ఇక అప్పట్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 31 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలోనే వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాకు ముందుగా హీరోగా అల్లు అర్జున్ ని హీరోగా  అనుకోలేదట. ఇకపోతే ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముందుగా

 సుకుమార్ మరొక స్టార్ హీరోని అనుకున్నారట. ఇక ఆ హీరో మరి ఎవరో కాదు అల్లరి నరేష్ .సుకుమార్ ముందుగా ఈ కథను అల్లరి నరేష్ కోసం అనుకున్నారట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా అల్లరి నరేష్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 100% లవ్ షూటింగ్ సమయంలో అల్లరి నరేష్ను కలిశారట సుకుమార్. అప్పుడు అల్లరి నరేష్తో సుకుమార్ మాట్లాడుతూ... ఆర్యక సినిమా మీ కోసమే రాశాను అంటూ చెప్పాడట.. ఈ విషయం అల్లరి నరేష్ స్వయంగా తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: