చిత్ర పరిశ్రమలో రాజమౌళి  అంటే తెలియని వాళ్ళు అయితే ఉండరు.అతని సినిమా అంటే నచ్చని వాళ్ళు అయితే ఉండరు.ఇక ఆయన సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఉండే హుషారే వేరు.

రాజమౌళి సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఏప్పుడెప్పుడాఅని ఫ్యాన్స్ ఎదురు చూస్తారు. ఆర్ఆర్ఆర్  తరువాత రాజమౌళి ఎలాంటి మూవీ అప్డేట్ ఇవ్వడం లేదు. కానీ తరువాత మూవీ మహేష్ బాబుతో ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే డిసెంబర్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తున్నట్లు సమాచారం.ఇంతలో దిగ్గజ దర్శకుడి రాజమౌళి గురించి ఓ హాట్ టాపిక్ సోషల్చ మీడియా లో తెగ వైరల్ అవుతుంది . ఓ వైపు మహేష్ తో ప్రాజెక్టు చేస్తూనే.. మరోవైపు రవితేజ మూవీతో కమిట్ అయ్యాడని సమాచారం..

ధమాకా బంపర్ హిట్టు తరువాత మాస్ మహరాజ రవితేజ ఫామ్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఆ తరువాత విడుదలైన ‘రావాణాసుర’ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. దీంతో ఈయన బిజీగా ఉన్నాడు. లేటేస్టుగా ఆయన ‘టైగర్ నాగేశ్వర్ రావు’ అనే మూవీ కోసం పనిచేస్తున్నాడటా.. ఇందులో రవితేజ ఊర మాస్ లుక్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మే 24న రాజమండ్రి బ్రిడ్జిపై విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ బ్యానర్ పై నిర్మిస్తున్న దీనిని వంశీ డైరెక్షన్ చేస్తున్నాడటా.ఇందులో నుపూర్ సనన్ హీరోయిన్. ఇందులో గడ్డంతో ఉన్న రవితేజను చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఆయన సినిమాలో వాటన్నింటికంటే ఇందులో డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో ఎమోషనల్ అవుతున్నారటా..‘టైగర్ నాగేశ్వర్ రావు’ తరువాత రవితేజ సుధీర్ వర్మతో కమిట్ అయ్యారటా. ఇప్పటికే వీరిద్దరు కలిసి రావాణసురతో వెండితెరపైకి వచ్చారు. అయితే మరోసారి ఈ కాంబో కలవనుందని సమాచారం.. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందటా.ఈ తరుణంలో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అయితే మారింది. రవితేజ తో ఈసారి సుధీర్ వర్మ తీయబోయే చిత్రాన్ని పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నాడని తెలుస్తుంది.సరికొత్త కథతో పాటు మేకింగ్ లో కూడా చాలా మార్పులు చేయనున్నారట.

ఇందుకోసం ఆయన రాజమౌళి సలహా తీసుకోనున్నాడని సమాచారం.. రాజమౌళి-రవితేజల కాంబోలో విక్రమార్కుడు వచ్చిన సంగతి తెలిసింది. కుదిరితే ఎప్పటికైనా రవితేజతో మరో సినిమా చేయడానికి రాజమౌళి సిద్ధంగా ఉన్నాడటా.కానీ సమయం సరిపోవడం లేదు. అయితే సుధీర్ వర్మ తీసే చిత్రానికి రాజమౌళి విలువైన సూచనలు ఇవ్వడనున్నాడని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: