
ఇక ఈ సినిమాపై అటు బాలయ్య అభిమానుల్లో భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేయబోతున్నాడు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది. గోపీచంద్ మలినేని బాబి లాంటి దర్శకులు కథలు వినిపించినట్లు టాక్ వినిపిస్తున్న.. అఫీషియల్ అప్డేట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. అయితే అనిల్ రావిపూడి సినిమా తర్వాత బాలకృష్ణ ఒక మల్టీస్టారర్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడట. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో కలిసి ఒక మల్టీస్టారర్ లో నటించబోతున్నాడట.
ఇక ఈ సినిమా తొలి భాగంలో శివరాజ్ కుమార్, బాలకృష్ణ కలిసి నటిస్తే.. రెండో భాగంలో వీరికి మరో స్టార్ జత కలవనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రజినీకాంత్ పేరును కూడా పరిశీలిస్తున్నారట. ఒకవేళ రజినీకాంత్ డేట్స్ ఖాళీ లేకపోతే కమల్ హాసన్ లేదా మమ్ముట్టి మోహన్లాల్ లలో ఎవరినో ఒకరిని ఇక ఈ సినిమాలోకి తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇక ఈ ప్రాజెక్టుకి హర్ష దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు శివరాజ్ కుమార్ తన సొంత నిర్మాణ సంస్థతో పాటు మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి ఈ సినిమాను రూపొందించబోతున్నారట. కాగా దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.