ఎన్టీఆర్, కృష్ణ టాలీవుడ్ లో ఎందరో అభిమానులని సొంతం చేసుకున్నారు .. ఇక ఇద్దరికీ కూడా మంచి అనుబంధం అయితే ఉండేది.అయితే.. కొన్నాళ్లకు వివాదం కూడా ఏర్పడింది. దీనిని ఎన్టీఆర్ కన్నా కూడా.. కృష్ణ చాలా సీరియస్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగాను తీసుకున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు కూడా ఎన్టీఆర్ తో పోటీ పడ్డారటా..  కొన్ని కొన్ని సార్లు సక్సెస్ అయిన కానీ ఆ తర్వాత మాత్రం ఫెయిల్యూర్ అయింది. అయితే ఇద్దరి మధ్య మంచి అనుబంధం మాత్రం ఉండేది .. ఎన్టీఆర్ పై అభిమానాన్ని కృష్ణ పలు సందర్భాల్లో  చెప్పుకొచ్చారు... ప్రస్తుతం వీరు మన మధ్య లేకపోయినా వారు అందించిన సినిమాలు శాశ్వతంగా ఉండిపోతాయి.

తెలుగు చిత్రపరిశ్రమలోనే లెజెండ్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు అగ్ర నటుల సినిమాలు రెండు రోజుల వ్యవధిలోని రీ రిలీజ్ తో బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్నాయని తెలుస్తుంది.ఆ సినిమాలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలోనే గోల్డెన్ సినిమాలుగా అయితే మిగిలిపోయాయి. ఎన్టీఆర్ అడవి రాముడు,కృష్ణ మోసగాళ్లకు మోసగాడు. వీరిద్దరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఒకప్పుడు బాక్సాఫీస్ హీటెక్కిపోయేది. అయితే ఇప్పుడు వారిద్దరు చనిపోయినా కూడా తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడం  విశేషం ఈ రెండు సినిమాలు త్వరలో ప్రేక్షకులు ముందుకు రానున్నాయటా.. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా అడవి రాముడు.. సినిమాను మే 28న తెలుగు రాష్ట్రాలతో ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు కూడా సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తారని తెలుస్తుంది. యాభై ఏళ్ల క్రితమే టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తెలుగు మూవీగా అడవిరాముడు నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా జయసుధ, జయప్రద హీరోయిన్లుగా అయితే నటించారు. అడవి రాముడు మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కానుండటంతో నందమూరి అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.. ఇక సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా.. మే 31న మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ కానుందటా.ఈ సినిమా కృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో ఒకటి గా నిలిచింది.. కృష్ణ మూవీకి రెండు రోజుల ముందు ఎన్టీఆర్ బ్లాక్బస్టర్ హిట్ రీ రిలీజ్ కానుండటం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారిందని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: