తెలుగు సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమాగా పేరుపొందిన నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగువారిని సైతం ప్రపంచం మొత్తానికి తెలియజేసేలా చేసిన ఈయన ప్రయాణం ఒక చరిత్రని చెప్పవచ్చు. ఎలాంటి పాత్రలో నైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఆ పాత్రకు తిరుగు లేదనిపించుకుంటూ ఉంటారు. కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడుగా, ఎడిటర్ గా, రైటర్ గా ,నిర్మాతగా ఎన్నో సేవలు అందించారు. ఈ రోజున ఆయన 100 వ పుట్టిన రోజు సందర్భంగా ఈయన గురించి తెలియని కొన్ని విషయాలు అభిమానులు తెలుసుకోవడానికి చాలా ఆత్రుతగా ఉన్నారు.వాటి గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


ఎన్టీఆర్ వారసులుగా బాలకృష్ణ హరికృష్ణ లను కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి డైరెక్షన్ చేశారట. అలాగే జూనియర్ ఎన్టీఆర్ని రామారావు కూడా డైరెక్టర్ చేశారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయం వైపుగా వెళ్లిన ఎన్టీఆర్ మళ్లీ దాదాపుగా ఏడు సంవత్సరాల గ్యాప్ తర్వాత బ్రహ్మహర్షి విశ్వామిత్ర అనే చిత్రాన్ని మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, ఎడిటింగ్, నిర్మాత నటుడు అన్ని తానే అయి ఈ సినిమాని తెరకెక్కించారు. నందమూరి తారక రామారావు గారు తొలి తరం హీరోగా ఒక వెలుగు వెలిగిన చిత్తూరు నాగయ్యను ఎన్టీఆర్ గురువుగారుగా భావించేవారు. అయితే ఇండస్ట్రీలోకి రాకముందే నాగయ్య పైన ఎన్టీఆర్కు మంచి గౌరవం ఉండేది కాబట్టి ఆయనని తండ్రిలాగా భావించే వారట.


ఎన్టీఆర్ సినీ జీవితంలో ఎంతోమంది హీరోయిన్స్ తో నటించారు వారందరికీ కూడా మర్యాద ఇవ్వడమే కాకుండా వారితో మంచి అనుబంధాన్ని కూడా ఏర్పరచుకున్నారు. ఎన్టీఆర్ తన తల్లినే కాకుండా మరొక వ్యక్తిని కూడా అమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఆమె ఎవరో కాదు పుండరీ బాయ్.. సీనియర్ ఎన్టీఆర్కు ఒక తీరని కోరిక మిగిలిపోయిందట అదేమిటంటే అల్లూరి సీతారామరాజు పాత్ర ఈ పాత్ర చేయడం కోసం చాలా ఆశపడ్డారు కానీ ఎన్నోసార్లు ప్రయత్నించిన అది ఫలించలేదట. ఇక ఎన్టీఆర్ 40 ఏళ్ల వయసులో కూడా కూచిపూడి నేర్చుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క సీన్ కోసం ఎన్టీఆర్ సెన్సార్ బోర్డుతో కూడా గొడవపడి మూడేళ్ల పార్టు కోర్టు చుట్టూ తిరిగినట్లు సమాచారం. ఇక ఇవే కాకుండా ఎన్నో విషయాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: