తరచూ సినిమా షూటింగ్ సెట్లో అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉంటాయి. గతంలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి , ప్రభాస్ నటించిన ఆది పురుష్, తదితర చిత్రాలలో సెట్స్ దహనం అవ్వగా అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ దుండిగల్ పరిధిలో బౌరంపేటలో అర్థరాత్రి సమయంలో ఈ మంటలు చెలరేగాయని స్థానికులు తెలియజేస్తున్నారు.


ఇటీవల వర్షానికి కూలిన సెట్ కి మరమ్మతు చేస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు అక్కడ స్థానికులు తెలియజేశారు  ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్స్ సిబ్బంది అక్కడికి రావడంతో మంటలను ఆర్పి వేశారట.. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కూడా ఆలస్యమవుతోంది .మరొకవైపు రాజకీయాలు సినిమాలు రెండిటిని సమాంతరంగా మెయింటైన్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ కాల్ సీట్లు సమస్య తలెత్తుతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ క్రిష్ ఎంత ప్రణాళిక బద్ధంగా ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇప్పుడు సెట్స్ రిపేరు సమయంలో అగ్నిప్రమాదం చాలా ఇబ్బందికరంగా మారుతుంది తిరిగి నిర్మించి పెండింగ్ చిత్రీకరణ షూటింగును కూడా పూర్తి చేయాల్సి ఉన్నది.. కోహినూర్ వజ్రం దొంగతనం.. నెమలి సింహాసనం తరలింపు సహ పలు చారిత్రక అంశాల పైన కూడా ఈ చిత్రాన్ని జరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రంలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ అందుకే అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ క్రేజన దృష్టిలో పెట్టుకొని మొత్తం విడుదలకు ముందే ఈ సినిమా బడ్జెట్ వెనక్కి వస్తుందని చిత్ర బృందం అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: