ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి భారీ బడ్జెట్ తో ... భారీ అంచనాలతో రూపొందుతున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తూ ఉండగా ... బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి దీపికా పదుకొనే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటిస్తోంది. బిగ్ బి అమితా బచ్చన్ , దిశా పటానిమూవీ లో కీలక పాత్రలో కనిపించనుండగా ... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మహానటి మూవీ తో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచకున్న నాగ్ అశ్విన్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీ గా రూపొందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో అప్డేట్ లు బయటకు వచ్చాయి. వాటితోనే ఈ మూవీ పై అంచనాలు భారీ స్థాయికి పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది కనుక నిజం అయితే ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం ఏమిటో తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రాజెక్టు కే మూవీ యూనిట్ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్ర కోసం కొంత మంది నటులను అనుకుంటుందట.

అందులో భాగంగా లోక నాయకుడు కమల్ హాసన్ తో చర్చలు కూడా జరుపుతుందట. కాకపోతే కమల్ ఇంకా ఈ సినిమాకు అంగీకారం తెలపలేదట. మరికొన్ని రోజుల్లోనే ఈయన దగ్గర నుండి ఏదో ఒక విషం తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒక వేళ కమల్ కనుక ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయితే ఈ మూవీ పై అంచనాలు తారస్థాయికి చేరే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: