అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు తాజాగా ఏజెంట్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సాక్షా వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించాడు. ఈ మూవీ లో మలయాళ సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఈ మూవీ కి హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు.

మూవీ ని దర్శకుడు సురేందర్ రెడ్డి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు దారుణమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడంతో చివరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణమైన అపజయాన్ని అందుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ మూవీ నుండి "రామకృష్ణ" అంటూ సాగే వీడియో సాంగ్ ను ఈ మూవీ బృందం ఈ రోజు సాయంత్రం విడుదల చేసింది. మరి ఈ మూవీ లోని ఈ వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: