తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ సరసన సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయక నటిస్తూ ఉండగా ... తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం ఒక వీడియోను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ఉండడం ... వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న లోకేష్ కనకరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడం ... అలాగే ఇది వరకే విజయ్ ... లోకేష్ కాంబినేషన్ లో రూపొందిన మాస్టర్ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో లియో మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి.

దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ యొక్క కేరళ హక్కులను ఈ మూవీ మేకర్స్ అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క కేరళ హక్కులను "గోకులం మూవీస్" సంస్థ 16 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: